ఏంటో.....నాకు నేనర్ధం కాకున్నా ఎదలో ఏం జరుగుతోందో తెలియకున్నా ఇక్కడే ఈ ఒంటరి నిశీధిలో నా నీడకై నే కురిసిపోతున్నా అందని చెలిమిని అన్వేషిస్తూ... మది ముంగిట నిలిచిపోతున్నా...
అందుకున్న చెలిమి అర్ధం వెతుకుతూ... ఇక్కడే ఉన్నా...నిశీధి జాడనై మిగిలిపోతున్నా...
ఏదో జ్వాల ఎదలో రగులుతోంది ముక్కలుగా తరుగుతూ మనసును చినుకులై కురుస్తోంది కదిలే ప్రతి నిమిషమూ చిక్కగా లోలోన కన్నీటి తెరలై చీల్చుతోంది ప్రతి గాయాన్ని పదే పదే ప్రశ్నిస్తూ...
ఇంతలో నువ్వొచ్చావ్...చెమరించే గుండెగదికి నవ్వుల మువ్వలు తోరణాలు కడతానంటూ...
కానీ పెరిగిన సంప్రదాయం నన్ను కన్నీటి గడప సైతం దాటనీకుంది.. చెలిమి మధురిమ తెలియనీకుంది
ఎద వీణియ ఏ పల్లవీ నేర్వకనే మూగబోతూ..... ఇలా...ఇలా....ఇలా....గుండెగది ని తాకిన నీ ప్రేమలా ... ఇలా కురుస్తూ...జ్వలిస్తూ....పొగ నిట్టూరుస్తూ....
కానీ ...కానీ...నీకొకటి తెలుసా ... ఎప్పటికీ నేను నీ చెలిమిని విడువను... జీవితంలో ఎప్పటికైనా నీకొక్కసారి కనపడతా...
ఎప్పుడంటే ...
ఇక ఈ జీవన వేదాన్ని మోసుకెళ్ళలేని నిస్సహాయంలో ఈ బ్రతుకు పోరాటాన్ని సాగించలేని అంగవైకల్యంలో ఈ ఒంటరితనపు ఏకాంతాన్ని సజీవ సమాధి చేసే ఏకైక యత్నంలో ఆఖరి శ్వాస తీసుకోవాలని నిర్ణయించుకున్న ముందురోజు
ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి....
నీ చేతి స్పర్శ తో ధైర్యం కూడగట్టుకుని ఆనందంగా మరుజన్మ ఏదైనా ... నిన్నే నాకు చెలిమి పిలుపుగా ముందుగానే పరిచయించమని ఆ దైవాన్ని కోరుకుంటూ ఆ క్షణం తలచి అపరిమితంగా సంతోషిస్తూ తుది శ్వాసకై పరుగెడుతూ...
No comments:
Post a Comment