Monday 7 January 2013

అభిసారిక




  



ఏదో మారాడాలని ఉంది..........
పెదవులు ఒణుకుతున్నాయ్ పదములు పలకకున్నాయ్

భాష రాకుంది భావాన్ని వెలికి తేకుంది
మదిలో మెదిలే మిసమిసలేవీ వెలికి రాకున్నాయ్

రెప్పవేస్తే కరిగిపోయే స్వర్గంలా నీ రూపు తోస్తోంది
ఈ క్షణం కరిగితే......ఇన్నాళ్ళ వేదనా ఎలా నివేదించనోయీ

కాలపు వేళ్ళ సందుల్లోంచి
ఈ ఘడియల్ని జారనీక పట్టుకోవాలనుంది

కానీ.......నువ్ జారిపోతున్నావ్ నా కలల్లోంచి
నీ రూపు కదిలిపోతోంది నా కనుల్లోంచి


మళ్ళీ ఎప్పుడో ఈ నిశీధికి నీ వెన్నెల రాక
అప్పటివరకూ ఈ విరహాంధకారమే శాశ్వతమిక !!

2 comments:

  1. మీ భావ వ్యక్తీకరణ చాలా బాగుందండీ!

    ReplyDelete
    Replies
    1. మీ వంటి సాహితీ పిపాసకుల అభినందన స్పందనలే అక్షరాలకు ఊపిరి రసజ్ఞా జీ! ధన్యవాదాలు

      Delete