Friday 11 January 2013

ఎంకీ .....నే చూడలేనే........

వయ్యారముగా నువ్ నడుస్తు ఉంటే
ఘల్లని మ్రోగెను నీ సిరి చిరుమువ్వలు
పరవశమొందిన నా పసి మనసు నీ పారణై పులకరించెనే

అల్లి బిల్లిగా పైరగాలొకటి నీ పయ్యెదతో ఆటలాడగా
కృష్ణవేణిలా ఒంపులు తిరిగిన నడుము చూసి నే అలమటిస్తినే
నీ ఒయ్యారానికి కాపు కాస్తినే

చిగురుటాకుల చిరు చిరు పెదవుల మురిపెముగా నువ్ మాటలాడగా
నా మది నీతో సేద తీరగా చెంగున నీకై ఎగిరి వస్తినే
నీ కడ సర్వం మరచిపోతినే

కెంపుల పోటీ చేసిన చెక్కిట ఇంపుగ ఒదిగే
బుగ్గ చుక్కనై నే నిను చేరాలని ఆశపడితినే
రెండుమూరల పసుపు తాడునై నిండుగ వేసిన మూడు ముడులతో
నీ నొసటి కుంకుమై నీ సొగసుకు నే వెలుగునిస్తినే

నీ సోయగాల కాపు కాయగా నువు చుట్టుకొనే చీరనైతినే
సొబగుతొ సాగే పల్లె పదాన్నై నీ పెదవులలో ఒదిగిపోతినే

ఇంతా చేసి నిను చూడాలంటే నీ అందానికి దాసుడనైతినే
నిను చూడలేని బానిసైతినే

అందుకే నా ఎంకీ నువ్ నాకందని పాటవు నా ఆనందాల కోటవు

2 comments:

  1. నేనూ చూడలేదు....కానీ మీ కవితలో చూపించారుగా:-) బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మాజీ...మీ చూపు సోకి నా పదాలు పులకరించినట్లున్నాయి...మాఁవను చూసిన ఎంకి సోయగంలా..

      Delete