Tuesday 15 January 2013

జ్ఞాపకాల వెన్నెల.....




చెలీ ! గుర్తున్నానా....
నా పక్కనుంచెళ్ళావని
పువ్వులు చెప్పాయి

నా గతం తెరిచి చూసా
మొత్తం నేనే...అందుకే ఖాళీగా...శూన్యంగా
నువ్ పరిచయమయాక
నా వర్తమానంలో నిన్ను నింపా
నిండుగా నవ్వుతోంది  రేపటి ఆశ

నిన్ను వెతుకుతూ నీ ఊరెళ్ళా
అందరూ అపరిచయస్తులే
నీ జ్ఞాపకాల వెన్నెల తప్ప

నీ తలపులతో
కాలపునావలో ప్రయాణం

ఋతువుల కన్యల పలకరింపులు
అన్నీ అనుభూతులే...అలలెక్కడా లేవు

నీకు తెలుసా ...
ఇప్పుడు లోకమంతా నిద్రిస్తోంది
నేను ...నా పుస్తకమూ
నాలో చీకటి చీల్చిన నీ పరిచయం తప్ప...

3 comments:

  1. వావ్......భలే రాసారు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మాజీ....మీకు నచ్చిందంటే నా అక్షరం పాసయినట్లే....

      Delete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete