Friday 11 January 2013

నేస్తం ఇయ్యవూ....


ఓయ్ నిన్నే ....నేనే పిలుస్తున్నది
నాకేఁ కొంచెం కొంచెం ఇచ్చేయవూ
కొంచెం నమ్మకం.....కాసింత ధైర్యం

కష్టాల్లోనే కాదు సుఖాల్లో సైతం
వెంట ఉంటాననే అనుభూతుల స్పర్శ

కలిమిలోనే కాదు కలతలోనూ
నా నీడ నీవే అనిపించే వెచ్చని చూపుల స్పర్శ

కొద్దిగా అంటే కొద్దిగానే ఇవ్వు ఆపై మరింత మెత్తగా నవ్వు

మాటల్ని మంత్రాల్ని చేసి అక్షరాన్ని ఆయుధంగా మలచి
కవితలలో బ్రతికేస్తాను పాటలలో వెలిగేస్తాను

అందుకే మరింతగా ఇయ్యవూ నీ చెలిమీ
అదే కదా నా కవితల వెనుక కలిమీ...

ఏయ్ నీకు తెలుసా....
నీతో నాకు చెలిముంటేనే కవిత
అది లేనపుడు నాకు నేనే ఓ కలత

2 comments:

  1. తనెక్కడైనా ఉండనీ
    తన దారిలో ఒక
    చల్లని నీడనౌతా ....
    తన అణువణువులో నేనే
    ఒక భావ ధారగా మారి..
    ఒక కవితనౌతా.
    తనలో ధైర్యాన్ని నింపే
    ఒక శక్తినౌతా..
    .తనకి అన్నిటా తోడుండే
    ఒక నమ్మికనౌతా..

    ReplyDelete
    Replies
    1. ఇన్ని నమ్మకాలిస్తున్న మీ చెలిమితో మీ చెలి చాలా అదృష్టవంతురాలే కిషన్ జీ.. మీ స్పందనకు .ధన్యోస్మి

      Delete